Heat Stroke in Telangana: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి

చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heatwaves (photo-File image)

Hyderabad, May 7: తెలంగాణలో (Telangana) ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా (Karimnagar) వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడదెబ్బకు సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు. ఆదివారంకూడా మరణించిన వారి సంఖ్య నాలుగుగా రికార్డయ్యింది.

Heatwaves (photo-File image)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు