TSRTC: గ్రేటర్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌, టి-24 టికెట్‌ ధర రూ.100 నుంచి రూ.90కి తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ, ఈ టికెట్‌తో రోజంతా గ్రేటర్ పరిధిలో ట్రావెల్ చేయొచ్చు

టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందన్నారు.

VC Sajjanar (Photo-Twitter)

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టి-24 టికెట్‌ కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం టి-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించినట్టు చెప్పారు. రూ.50కి టికెట్‌ కొనుగోలు చేస్తే ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్‌-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి టికెట్‌ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు నలుగురు ప్రయాణించవచ్చన్నారు.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)