Telangana: బస్సులో దొరికిన పందెం కోడిని వేలం వేస్తున్న ఆర్టీసీ, కరీంనగర్ బస్ డిపోలో వేలం పాట, పూర్తి వివరాలు ఇవిగో..

వరంగల్ నుండి కరీంనగర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు బస్సులో కోడిని మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు.. గమనించిన కండక్టర్ కోడిని డిపోలో అప్పగించగా డిపో యాజమాన్యం దానికి జాలి ఏర్పాటు చేసి దాణా, నీళ్లు పెట్టి దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

Fighting cock

ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది. దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి ముహూర్తం నిర్ణయించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement