Road Accident Video: కారు ఉంది కదా అని రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకండి, అమాయకుల ప్రాణాలు తీయొద్దంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయండి
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేశారు.ఇందులో కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయండి. హరియణాలోని గురుగ్రామ్‌లో రెండు రోజుల క్రితం జరిగిందీ రోడ్డు ప్రమాదం. అదృష్టవశాత్తూ బైక్ రైడర్‌కి ప్రాణప్రాయం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి
Here's Video