Chicken Auction on Today: ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. కోడి తమదని మూడు రోజులు గడిచినా ఎవరూరాని వైనం.. నేడు వేలం వేయనున్న ఆర్టీసీ అధికారులు (వీడియోతో)
మూడు రోజుల క్రితం కరీంనగర్ లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని నేటి మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు వేలం వేయనున్నారు.
Karimnagar, Jan 12: మూడు రోజుల క్రితం కరీంనగర్ లో ఆర్టీసీ బస్సులో (RTC Bus) దొరికిన పందెం కోడిని (Chicken) నేటి మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు వేలం (Auction) వేయనున్నారు. నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్ మల్లయ్య తెలిపారు. పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)