Telangana Shocker: ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఇద్దరు యువకులు, పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన యువతి
మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు..
నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రేమను ఒప్పుకోలేదని యువతి తల్లిదండ్రులను అడ్డంగా నరికేసిన ఉన్మాది, అడ్డొచ్చిన యవతి, అమె సోదరుడిపైనా తల్వార్ తో దాడి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)