Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలిపై కోడె దాడి.. ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో
దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలో(Vemulawada Temple) ఆసక్తికర సంఘటన జరిగింది. గుడిలో భక్తురాలిపై కోడె దాడి చేసింది.
దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలో(Vemulawada Temple) ఆసక్తికర సంఘటన జరిగింది. గుడిలో భక్తురాలిపై కోడె దాడి చేసింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు ఆలయ అధికారులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వేములవాడ రాజన్న(Vemulawada Rajanna Temple) ఆలయం చాలా ప్రముఖమైంది. రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు శంకరుడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రంకు ఎంతో విశిష్టత ఉంది.
రాజేశ్వరఖండంలో చెప్పిన కథ ప్రకారం.. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట(Devotee Attacked by Cow in Temple). ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం. ఇక ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన వారు కోడెను కట్టడం ఆనవాయితీగా వస్తోంది.
Vemulawada: Devotee Attacked by Cow in Temple, Hospitalized
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)