Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం, ఈదురు గాలులతో వాన, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి, అబిడ్స్.. ఇలా నగర మధ్య ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం పడింది. ఈదురు గాలుల తాకిడికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ హైకోర్టు వద్ద ఈదురు గాలుల తాకిడికి భారీ వృక్షం ఒకటి నేలకొరిగింది. దీంతో రెండు బైక్‌లు, ఓ కారు ధ్వంసం అయ్యాయి. మహిళతో పాటు ఓ చిన్నారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)