Telangana: షాకింగ్ వీడియో.. వరదల్లో చిక్కుకుని 30 మంది విద్యార్థుల ఆర్తనాదాలు, అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు, డ్రైవర్‌ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం

అయితే డ్రైవర్‌ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

School bus strucks in flood water in Mahabubnagar district

మహబూబ్‌నగర్‌ కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గురువారం రాత్రి కురిసిన వానతో కోడూరు-మాచన్‌పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే రామచంద్రపూర్‌, మాచన్‌పల్లి, సుగుర్గడ్డ తండా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు స్కూలు బస్సులో వెళ్తున్నారు.

ఈ క్రమంలో అండర్‌ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్‌ సహాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ రూరల్ మండలం సూగూరు గడ్డ- మన్నెంకొండ స్టేషన్ల మధ్య రైల్వే అండర్ పాస్‌లో ప్రైవేటు స్కూలు బస్సు చిక్కుకున్న ఘటనపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)