Warangal: ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్
వరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
వరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు(Woman Assistant Professor Dharna)L.B కళాశాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్ రెడ్డి ని టీచర్ సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని నిరసన చెప్పారు.
ఎమ్మెల్సీ ప్రచారంలో టీచర్ సమస్యలను తీర్చాలని అడిగినందుకు కళాశాల నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో కళాశాల నుండి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారు. ఏడు సంవత్సరాలుగా ఫిలాసఫీ సబ్జెక్టు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు రాధ.
మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు
L.B కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని పలు అభియోగాలు ఉన్నాయి. కళాశాలలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపల్ కి భయపడి ఎవరు చెప్పుకోవట్లేదని తెలిపారు రాధ. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ క్రింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపల్ ఏకేపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలను ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
Woman Assistant Professor Radha Stages Dharna at Warangal LB College
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)