CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.

Yadagirigutta Devasthanam Board soon says Telangana CM Revanth Reddy(X)

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు. యాద‌గిరిగుట్ట పాలక మండలి నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి(CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో స‌మీక్షించారు.

ఆల‌య ప‌విత్ర‌త కు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలన్నారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు.  ఎకో టూరిజం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు, ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్‌లో అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలు 

యాద‌గిరిగుట్ట(Yadagirigutta) ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆల‌య ప‌విత్ర‌తకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నియామ‌కంతో పాటు ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, ధార్మిక సేవా కార్య‌క్ర‌మాల‌పై ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు ముఖ్య‌మంత్రి గారు ప‌లు మార్పులు సూచించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement