Tirupati: తిరుపతి జిల్లాలో ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత.. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన
తిరుపతి జిల్లాలో కలుషిత ప్రసాదం తిని 79కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు.
Tirupati, Sep 19: తిరుపతి జిల్లాలో (Tirupati) కలుషిత ప్రసాదం (Contaminated Food) తిని 79కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేవీబీపురం (KVB Puram) మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)