Bill Gates Drives Electric Auto: భారత్ రోడ్లపై ఎలక్ట్రిక్ ఆటో నడిపిన బిల్ గేట్స్, చ‌ల్తీ కా నామ్ బిల్ గేట్స్‌కి గాడి అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్(Bill Gates) మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో(Treo) ఎల‌క్ట్రిక్ రిక్షా(Electric Rikshaw)ను ఇండియ‌న్ రోడ్ల‌పై తిప్పారు.దానికి సంబంధించిన వీడియో గేట్స్ త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశారు.

Bill Gates Drives Electric Auto (Photo-Video Grab)

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్(Bill Gates) మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో(Treo) ఎల‌క్ట్రిక్ రిక్షా(Electric Rikshaw)ను ఇండియ‌న్ రోడ్ల‌పై తిప్పారు.దానికి సంబంధించిన వీడియో గేట్స్ త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆవిష్క‌ర‌ణ‌ల కోసం భార‌తీయుల త‌ప‌న ఎన్న‌టికీ తీరిపోద‌ని, నేనో ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపాను అని, ఆ రిక్షా 131 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంద‌ని, దాంట్లో న‌లుగురు ప్ర‌యాణికులు వెళ్ల‌వ‌చ్చు అని, ట్రాన్స్‌పోర్టు ఇండ‌స్ట్రీలో కార్బ‌న్‌ర‌హిత వాహ‌నాల‌కు మ‌హేంద్ర కంపెనీ ఆద‌ర్శ‌నీయంగా నిలుస్తుంద‌ని బిల్ గేట్స్ ఆ వీడియోకు కామెంట్ చేశారు.

బిల్ గేట్స్ చేసిన పోస్టుపై మ‌హేంద్ర కంపెనీ(Mahindra Company) చైర్మెన్ ఆనంద్ మ‌హేంద్ర(Anand Mahindra) ట్వీట్ చేస్తూ చ‌ల్తీ కా నామ్ బిల్ గేట్స్‌కి గాడి అంటూ కామెంట్ చేశారు. . ట్రియో వాహ‌నాన్ని న‌డిపే స‌మ‌యం మీకు దొరికినందుకు గ‌ర్వంగా ఉంద‌ని, మీ త‌ర్వాత ట్రిప్‌లో త్రీవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో రేస్‌లో పాల్గొందామ‌ని, ఆ రేసులో మీరు, నేను, స‌చిన్ ఉంటార‌ని ఆనంద్ మ‌హేంద్ర తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement