‘Emergency Alert’ on Your Phone: దేశ వ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపిన కేంద్రం, అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా మెసేజ్
ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది
దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అమలు చేస్తున్న TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌కి ఈ సందేశం పంపబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని గతంలో ట్రాయ్ కూడా తెలిపింది.
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)