Huawei: హువావేకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్, దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన పలు కార్యాలయాల్లో ఐటీ దాడులు, భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని తెలిపిన హువావే

దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి.

Huawei Technologies (Photo Credits: Twitter)

ప్రముఖ చైనీస్‌ టెలికాం దిగ్గజం హువావేకు ఆదాయ పన్నుశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీ, గురుగ్రామ్ (హర్యానా), కర్ణాటకలోని బెంగళూరు ప్రాంగణాల్లో మంగళవారం దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

విదేశీ లావాదేవీలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా పలు ఆర్థిక పత్రాలను, రికార్డులను అధికారులు పరిశీలించి అందులో కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని హువావే ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గత ఏడాది షావోమీ, ఒప్పో చైనీస్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలను నిర్వహించింది. ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ. 6500 కోట్లను ఐటీ శాఖ జరిమానా వేసింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif