Govt Bans 54 Chinese Apps: మళ్లీ 54 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత్, దేశ భద్రతకు పెనుముప్పుగా మారాయని తెలిపిన కేంద్రం
భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించనుందని వార్తా సంస్థ ANI ట్వీట్ చేసింది.
గత సంవత్సరం, భారతదేశం PUBG మొబైల్, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది.
దేశ భద్రతకు సమస్య ఉన్న నేపథ్యంలో 54 చైనా యాప్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్‌సెంట్ జీవర్, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
వాటిల్లో పాపులర్ యాప్‌లైన టిక్, వీచాట్, హలో కూడా ఉన్నాయి. జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారినికి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020 మేలో చైనాతో సరిహద్దు ఘర్షణ మొదలైన తర్వాత ఇప్పటి వరకు 300 యాప్‌లను నిషేధించారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఆ ఏడాది జూన్‌లో తొలిసారి చైనీస్ యాప్‌లను బ్యాన్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)