Shopee's Exit from India: భారత్ నుంచి వెళ్లిపోయిన ఈ కామర్స్ దిగ్గజం షాపీ, ట్విట్టర్లో కౌంటర్ విసిరిన స్వదేశీ ఈ కామర్స్ దిగ్గజం మీషో

ఇక షాపీపై స్వదేశీ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది.

Mesho (Photo-Twiter)

సింగపూర్‌ ఇంటర్నెట్ దిగ్గజం సీ లిమిటెడ్‌(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని(షాపీ) భారత్‌లో పూర్తిగా (Shopee's Exit from India) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక షాపీపై స్వదేశీ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. మీషో ట్విట్టర్లో స్పందిస్తూ.. మీషోతో షాపీ-ఇంగ్ చాలా సులభమైనది, సులువైనది, వేగవంతమైనది." అంటూ షాపీ కంపెనీకి కౌంటర్ విసిరింది.

తమ సంస్థ ఉద్యోగుల నియామకం కోసం గేట్లను తెరిచి ఉంచామని మీషో పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం...మీషోలో ప్రోడక్స్ట్‌, ఇంజనీరింగ్, డిజైన్, యూఆర్‌, డేటా సైన్స్‌తో సహా అన్ని టీమ్‌లలో 136 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నటు​ తెలుస్తోంది. ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ ఫ్రం హోంను కూడా అందిస్తోంది. కాగా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు షాపీ ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif