Instagram Threads: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ ఇదిగో, థ్రెడ్స్ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న మెటా
‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ వారంలోనే వినియోగదారులకు పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ అంశంపై మెటా యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు.
ఈ అప్లికేషన్‌లో ట్విటర్ తరహా ఫీచర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. టెక్ట్స్ రూపంలో ఉన్న పోస్టులను లైక్ చేయచ్చు. కామెంట్, షేర్ చేసే వెసులుబాటు లభిస్తుందని యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్ ఆధారంగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించే వారినే ఇందులోనూ ఫాలో అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని అదే యూజర్‌నేమ్‌తో యాప్‌ను వినియోగించుకోవచ్చు.
Here's Update