Microsoft Ends WordPad: వర్డ్‌ప్యాడ్‌‌కు బైబై చెప్పిన మైక్రోసాఫ్ట్, భవిష్యత్తు విండోస్‌ వెర్షన్లలో పనిచేయదని వెల్లడి, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఉపయోగించుకోవాలని సూచన

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ అయిన వర్డ్‌ప్యాడ్‌ కు ముగింపు పలకబోతున్నట్టు తాజాగా వెల్లడించింది. విండోస్‌ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్‌’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.డాక్యుమెంట్‌ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.

Microsoft to remove WordPad in future release of Windows

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ అయిన వర్డ్‌ప్యాడ్‌ కు ముగింపు పలకబోతున్నట్టు తాజాగా వెల్లడించింది. విండోస్‌ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్‌’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.డాక్యుమెంట్‌ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్తులో విడుదల చేసే విండోస్‌ వెర్షన్లలో ‘వర్డ్‌ప్యాడ్‌’ ఉండదని, అప్‌డేట్‌ వెర్షన్‌ కూడా రాదని, దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌’ను ఉపయోగించుకోవాలని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ ‘నోట్‌ప్యాడ్‌’ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.

Microsoft to remove WordPad in future release of Windows

 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement