Aditya-L1 Mission Update: మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్-1, ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్
ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్(ట్విటర్‌లో) పోస్టు చేసింది.
ఆదిత్య ఎల్-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్(ట్విటర్‌లో) పోస్టు చేసింది. ప్రస్తుతం వాహక నౌక(Space Carft) లగ్రాంజ్(Langrnge) పాయింట్-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్ పాయింట్-1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు.భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది.
Here's ISRO Tweet