CM Revanth Reddy announces Rs 1 crore for Trisha Gongadi from Telangana (CMO)

Hyd, Feb 6:  అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు.

కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష(Gongadi Trisha) జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. రాజకీయ అంశాలపై చర్చ, స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్ల హామీపై చర్చ జరిగే అవకాశం

త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ గారికి, ట్రైనర్ షాలిని గారికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రిష స్వస్థలం. సీఎంను కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, సీఎస్ శాంతి కుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు ఉన్నారు.