CM Revanth Reddy Meeting With Congress MLAs Today(X)

Hyd, Feb 6:  ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఉదయం 11 గంటలకు ఎమ్​సీఆర్​హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు(Congress MLAs). అలాగే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.

ఎమ్మెల్యేల తిరుగుబాటు అంశం ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇక అధికారం చేపట్టాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి (Telangana Congress)సమావేశం కావడం ఇది రెండోసారి.

పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ భేటీలో ఎమ్మెల్యేల అంసతృప్తితో పాటు క్షేత్రస్థాయిలో పాలనపై ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, బడ్జెట్‌ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల్లో 42శాతం సీట్లు ఇస్తామనే హామీలపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.

ప్రధానంగా ఎమ్మెల్యేల వైఖరిపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా సీఎం దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.