BRS MLS KTR (Photo-Video grab)

Hyderabad, FEB 05: పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికైనా కనికరం లేని కాంగ్రెస్ (Congress) సర్కారు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. తమ పదవీకాలంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన తాజా మాజీ సర్పంచ్లకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నిలదీశారు.

Telangana: వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు  

మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నట్లుగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని.. బడా కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లకు కమీషన్ల పేరుతో నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు సర్పంచుల నుంచి కమీషన్లు రావన్న ఒకే ఒక్క కారణంతో వారి బిల్లులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాజకీయ పరమైన వివక్షకు తావులేకుండా గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడిన సర్పంచుల డిమాండ్ మేరకు బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.