Artificial Tongue: ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెల్లుచీటీ.. కృత్రిమ నాలుకను అభివృద్ధి చేసిన పరిశోధకులు
ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు.
Newdelhi, Feb 29: నోటికి సంబంధించిన వ్యాధులకు (Mouth Bacteria) చెక్ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ (Artificial Tongue) (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు. కొత్త రుచులను గుర్తించడంతో పాటు.. ఓరల్ ఇన్ఫెక్షన్లను, డెంటల్ డిసీజెస్ ను, క్యావిటీలను కలుగజేసే 11 రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాల్లో గుర్తించడంతో పాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్లు తెలిపారు. సెన్సర్ల సాయంతో పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ టంగ్‌ను లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఎనిమిది మరణాల్లో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లతోనే జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)