Zero Shadow Day Today: నేడు బెంగళూరులో జీరో షాడో డే.. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం.. ఎందుకు?
ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ అంటారు.
Bengaluru, Apr 24: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) నేడు మధ్యాహ్నం కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ (Zero Shadow Day) అంటారు. బుధవారం మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం కానుంది. వస్తువులు, జీవులపై ఆ ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నిటారుగా పడుతాయి. దాంతో ఆ సమయం దేని నీడ దాని కిందే సరిగ్గా ఉండిపోతుంది. కాబట్టి బయటికి కనిపించదు. దీన్నే ‘జీరో షాడో డే’గా పిలుస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)