Chandrayaan-3 Mission: జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగన ఫోటోను క్లిక్‌మనిపించిన రోవర్ ప్రజ్ఞాన్, నాసా ట్వీట్ ఇదిగో..
చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ తన ట్వీట్‌లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్(Pragyan Rover)కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది
ఇస్రో తాజాగా మరో అప్ డేట్ అందించింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ తన ట్వీట్‌లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్(Pragyan Rover)కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది. కాగా చంద్రయాన్-3(Chandrayaan-3) మిషన్ కోసం లాబరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్-సిస్టమ్స్(ఎల్ఈఓఎస్) సంస్థ నావిగేషన్ కెమెరాలను రూపొందించిన విషయం తెలిసిందే.
ఎల్ఈఓఎస్ సంస్థ బెంగుళూరులోని పీన్యా పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉంది. ఇక్కడే 1975లో ఇండియా తన తొలి శాటిలైట్‌ను రూపొందించింది. అంతరిక్ష ప్రయోగాల కోసం ఆ సంస్థ యూనిట్‌లో అటిట్యూడ్ సెన్సార్లను డిజైన్ చేస్తారు.కాగా చంద్రుడిపై సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు మంగళవారం రోవర్ గుర్తించిన విషయం తెలిసిందే.
Here's ISRO Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)