SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది

SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..
ISRO SpaDeX Mission Launched (Photo Credits: X/ISRO,ANI)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.స్పేస్ డాకింగ్ లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం జరిగింది.

దీని ద్వారా స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) (Spadex Mission) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయనున్నారు.పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు కీలకం కానున్నది.అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది.

వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్

2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ఇస్రో పావులు కదులుతోంది. ఇందులో భాగంగా పీఎస్ఎల్వీ-సీ60 తాను మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.స్పేస్ డాకింగ్ చేయగల సామర్థ్యం గల రెండు ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్‌ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

SpaDeX Mission Launched:

చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం అయితే ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.

పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ హరాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. వాహక నౌక 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పేడెక్స్‌ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలి భాగమని చెప్పారు. డాకింగ్‌ ప్రక్రియకు మరో వారం సమయం పడుతుందని, జనవరి 7న డాకింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 30, 2024 10:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).