Covid Virus in Human Body: రక్తంలో 14 నెలల పాటు కరోనా.. ఇక కణజాలంలో ఏకంగా రెండేండ్ల వరకు వైరస్.. తాజా అధ్యయనంలో వెల్లడి
కొవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ యాంటి జెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
Newdelhi, Mar 9: కొవిడ్ (Covid) తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో (Blood) వైరస్ యాంటి జెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. చాలామందిలో లాంగ్ కొవిడ్ కు (Long Covid) ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లాంగ్ కొవిడ్ కు, గుండెపోట్లకు ఈ వైరస్ శకలాలే కారణమా అనేది కచ్చితంగా నిర్ధారించేందుకు మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకుడు మైఖేల్ పెలుసో పేర్కొన్నారు.