NBK 109 Glimpse: వయలెన్స్ తో విశ్వరూపం చూపించేందుకు వస్తున్న బాలయ్య బాబు, NBK 109 గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్, పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టిన నటసింహం
మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ చూస్తే.. బాలకృష్ణ ఎప్పటిలాగే తన పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్యా డైలాగ్ చెప్పడం వీడియోకే హైలెట్‌గా నిలిచింది.
Hyderabad, March 08: గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అంటే బాలకృష్ణ (Balakrishna ). ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్‌లో పెట్టాడు బాలయ్య. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109 (Nbk 109 Glimpse). వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలావుంటే మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Elated to unveil our #NBK109Glimpse on this auspicious day of Maha Shivratri. 🔱✨
Here's Unleashing the 𝘾𝙪𝙡𝙩 𝙎𝙖𝙧𝙪𝙠𝙪!! 💥🔥
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు! #NBK109 #NandamuriBalakrishna @MusicThaman @thedeol @Vamsi84 @KVijayKartik… pic.twitter.com/vluLIkBnJu
— Bobby (@dirbobby) March 8, 2024
ఈ గ్లింప్స్ చూస్తే.. బాలకృష్ణ ఎప్పటిలాగే తన పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్యా డైలాగ్ చెప్పడం వీడియోకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
ఇటీవల శరవేగంగా షూటింగ్ జరిగిన ఈ సినిమా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తుండటంతో బాలయ్య బాబు ఆ బిజీలో ఉండి షూట్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు(Nbk 109 Glimpse) సమాచారం. ఈ సినిమా 1980లో స్టోరీతో, ఫుల్ యాక్షన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు, ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో సినిమా ఓపెనింగ్ సమయంలో ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
(The above story first appeared on LatestLY on Mar 08, 2024 07:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

