DCGI Guidelines for Blood Banks: రక్తం అమ్మకానికి కాదు.. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. దవాఖానలు, బ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ స్పష్టీకరణ
దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సూచించింది.
Newdelhi, Jan 5: దవాఖానలు (Hospitals), బ్లడ్ బ్యాంకులు (Blood Banks) రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్ ఫీజు(Processing Fees)ను మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ-DCGI) సూచించింది. అత్యంత విలువైన రక్తాన్ని ఉచితంగా అందించాలన్నదే మనందరి అభిమతమని తెలిపింది. కానీ కొన్ని దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రకరకాల చార్జీలు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధానానికి స్వస్తి పలకాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బ్లడ్, బ్లడ్ కాంపోనెంట్స్ కు రూ.250 నుంచి రూ.1,550 వరకు ప్రాసెసింగ్ ఫీజు సరిపోతుందని డీసీజీఐ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)