Deep Sleep Memory Interlink: మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు.. ‘జర్నల్ న్యూరాలజీ’లో నివేదిక
30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు.
Newdelhi, Jan 5: 30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో (Sleep) పదే పదే అంతరాయాలు (Interruption) ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో సైంటిస్టుల అధ్యయనంపై ‘జర్నల్ న్యూరాలజీ’ నివేదిక విడుదల చేసింది. ‘అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి అనేక ఏండ్ల ముందే, మెదడులో వ్యాధి పేరుకుపోతున్నది. నిద్రకు.. జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక, నిద్ర సమస్యలు.. వ్యాధులబారిన పడటాన్ని పెంచుతున్నదని అర్థమైంది’ అని పరిశోధకుడు యా లెంగ్ అన్నారు. మధ్య వయస్సులో గాఢ నిద్ర చాలా అవసరమని మా అధ్యయనం తేల్చిందని ఆయన చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)