INSAT-3DS Update: జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరుకున్న INSAT-3DS ఉపగ్రహ మిషన్, నాలుగు లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని తెలిపిన ఇస్రో
ISRO మొత్తం నాలుగు ప్రణాళికాబద్ధమైన లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఫిబ్రవరి 22, గురువారం INSAT-3DS ఉపగ్రహ మిషన్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ISRO మొత్తం నాలుగు ప్రణాళికాబద్ధమైన లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది. "స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు జియోసింక్రోనస్ కక్ష్యలో ఉంది. ఇది ఫిబ్రవరి 28, 2024 నాటికి ఇన్ ఆర్బిట్ టెస్టింగ్ (IOT) స్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ISRO ఫిబ్రవరి 17న GSLV F14 లాంచ్ వెహికల్‌లో INSAT-3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింన సంగతి విదితమే.
INSAT-3DS ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలో ఉన్న భారతీయ ఉపగ్రహాల శ్రేణిలో చేరి, మెరుగైన వాతావరణ పరిశీలనల కోసం భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఉపగ్రహం వాతావరణ సూచన కోసం భూమి మరియు సముద్ర ఉపరితలాలను పర్యవేక్షిస్తుంది మరియు ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికలకు కూడా ఉపయోగపడుతుంది. గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు, ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ రెడీ, అంతరిక్షంలోకి వెళ్ళడమే తరువాయి..
Here's ISRO Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)