PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.
Newdelhi, Dec 31: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ (PSLV Rocket) ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్ పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్ పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)