New Hyundai Venue

Mumbai, FEB 09: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్‌ మోటార్ ఇండియా (Hyundai Motor India) త్వరలో తన హ్యుండాయ్‌ వెన్యూ -2025 కారును ఆవిష్కరించనున్నది. తొలుత 2019లో తన సబ్‌-4 మీటర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును తొలుత ఆవిష్కరించింది. 2022 జూన్‌లో హ్యుండాయ్‌ వెన్యూ మిడ్‌ లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Hyundai Venue Mid-Life Facelift) కారును తీసుకొచ్చింది. తాజాగా నెక్ట్స్‌ జనరేషన్‌ వర్షన్‌ వెన్యూ కారును తీసుకొస్తున్నది. సబ్‌ -4 మీటర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), టాటా నెక్సాన్‌ (Tata Nexon), కియా సోనెట్‌ (Kia Sonet), కియా సిరోస్‌ (Kia Syros), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO), స్కోడా కైలాక్‌ (Skoda Kylaq) కార్లకు హ్యుండాయ్‌ వెన్యూ గట్టి పోటీ ఇవ్వనున్నది.

Big Discount On Hyundai Verna: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్‌పై ఏకంగా రూ. 75వేల వరకు డిస్కౌంట్, ఇంకెందుకు ఆలస్యం 

పలు ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుండాయ్‌ వెన్యూ (Hyundai Venue) ఏడాదికి లక్షకు పైగా యూనిట్లు విక్రయిస్తోంది. 2022లో 1,20,703, 2023లో 1,29,278, 2024లో 1,17,819 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్‌ వెన్యూ (Hyundai Venue)కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ల నేచరుల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ (83పీఎస్‌ విద్యుత్‌, 113.8 ఎన్‌ఎం టార్క్‌), 1.0-లీటర్ల కప్పా టర్బో జీడీఐ (120 పీఎస్‌ విద్యుత్‌, 172 ఎన్‌ఎం టార్క్‌), 1.5-లీటర్ల యూ2 సీఆర్‌డీఐ వీజీటీ (116 పీఎస్‌ విద్యుత్‌, 250 ఎన్‌ఎం టార్క్‌) ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ కారు 5- స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ విత్‌ 1.2-లీటర్ల పెట్రోల్‌ యూనిట్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 7-స్పీడ్‌ డీసీటీ విత్‌ 1.0-లీటర్ల టర్బో పెట్రోల్‌ యూనిట్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ విత్‌ 1.5- లీటర్ల డీజిల్‌ యూనిట్‌తో నడుస్తుంది. సెకండ్‌ జనరేషన్ వెన్యూ కారులోనే ఈ పవర్‌ట్రైన్ ఆప్షన్లు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

MG Astor 2025 Launched: పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో మార్కెట్లోకి ఎంజీ అస్టర్‌, కేవలం రూ.9.99 లక్షలకే ప్రారంభం 

హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue) పలు ఫీచర్లతో వస్తోంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్‌ (LED projector headlamps), కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్ (connected LED taillamps), డైమండ్‌ కట్‌ అల్లాయ్ వీల్స్ (diamond-cut alloy wheels), ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ (electric sunroof), టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ (touchscreen infotainment system), డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ (digital instrument cluster), వైర్‌లెస్‌ చార్జర్ (wireless charger), డాష్‌ కామ్‌ విత్‌ డ్యుయల్ కెమెరా (dashcam with dual camera), సిఎక్స్‌ ఎయిర్ బ్యాగ్స్‌ (six airbags), లెవెల్‌ 1 అడాస్‌ (Level 1 ADAS) తదితర ఫీచర్లు ఉన్నాయి.

కొత్త అవతార్‌లో వస్తున్న హ్యుండాయ్ వెన్యూ వెంటిలేటెడ్‌ అండ్‌ పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్స్‌ (ventilated and powered front seats), బిగ్గర్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యూనిట్స్‌ (bigger touchscreen infotainment and instrument cluster units), న్యూ క్లైమేట్‌ కంట్రోల్‌ యూనిట్‌ (new climate control unit), లెవెల్‌ 2 అడాస్‌ (Level 2 ADAS) తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇవే ఫీచర్లు ఇతర కార్లలో అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue) కారు ధర రూ. 7,94,100 (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి రూ.13,52,600 వరకూ (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య పలుకుతోంది. నూతనంగా ఆవిష్కరించనున్న హ్యుండాయ్ వెన్యూ ధర రూ.8.50 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి రూ.15.50 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) వరకూ పలుకుతుందని భావిస్తున్నారు.