Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్ లెస్ చార్జర్ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్ ఇంప్లాంట్
ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
Newdelhi, Dec 25: మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేయడానికి వైర్ లెస్ చార్జింగ్ పరికరాన్ని (Humanbody Wireless Charger) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం (Skin) కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు (Mice) దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మానవులపై నిర్వహించే ప్రయోగాల్లో కూడా విజయం సాధిస్తే, బ్యాటరీలు, వైరింగ్ లేని మెడికల్ ఇంప్లాంట్స్ (శరీరంలో కలిసిపోయే) అందుబాటులోకి వస్తాయన్నారు. శాస్త్రవేత్త వెయ్ లాన్ మాట్లాడుతూ.. బయోడిగ్రేడబుల్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైసెస్ ను విస్తృత స్థాయికి తీసుకెళ్లడంలో తమ నమూనా పవర్ సప్లయ్ సిస్టమ్ గొప్ప ముందడుగును సూచిస్తుందన్నారు.