Realme12 5G Series: Pic Realme Official Page

Realme 12 5G Series: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ రియల్‌మి తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను ఆవిష్కరించింది. Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. Realme 12 5G సిరీస్‌ ధరలు రూ. 16,999/- నుంచి ప్రారంభమవుతున్నాయి. సామ్‌సంగ్, మోటరోలా, షియోమి వంటి కంపెనీలకు పోటీగా రియల్‌మి ఈ మిడ్-రేంజ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. మొదటి విడతలో మార్చి 10 వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా

ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై Realme Buds Wireless 3ని కంపెనీ ఉచితంగా అందిస్తోంది. SBI, HDFC , ICICI మొదలైన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 1,000 తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది.

ఇక, ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ ప్రధానం అంశాలను పరిశీలిస్తే ఈ రెండు రెండు హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Realme UI 5.0 కస్టమ్ UIపై పనిచేస్తాయి. అలాగే ఇవి మీడియాటెక్ చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో వచ్చాయి, తద్వారా అందుబాటులో ఉన్న మెమరీని 16GB వరకు విస్తరించవచ్చు. ఇందులో Realme 12+ 5G వేరియంట్ ప్రత్యేకమైన రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది వర్షం కురుస్తున్న సమయంలో లేదా తడి చేతులతో హ్యాండ్‌సెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మెరుగైన టచ్ ఇన్‌పుట్‌ను ఈ ఫీచర్‌ అందిస్తుంది.

అదనంగా, రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SuperVOOC ఛార్జింగ్
  • ధరలు:
  • 8GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 20,999/-
  • 8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 21,999/-

ఈ ఫోన్ నావిగేటర్ బీజ్ మరియు పయనీర్ గ్రీన్ అనే రెండు షేడ్స్‌లో లభిస్తుంది.

ఇక, బేస్ మోడల్ లో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Realme 12 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే
  • 6GB /8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్
  • వెనకవైపు 108MP + 2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 45W SuperVOOC ఛార్జింగ్
  • ధరలు:
  • 8GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 16,999/-
  • 8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 17,999/-

ఈ ఫోన్ వుడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.