Milky Way Galaxy: మన పాలపుంత నుంచి విడిపోతున్న నక్షత్రాలు.. ఇప్పటికే దాదాపు 1 కోటి నక్షత్రాలు బయటకు.. ఎందుకంటే??
మన పాలపుంత నుంచి కొన్ని నక్షత్రాలు విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు.
Newdelhi, Nov 12: మన పాలపుంత (Milky Way) నుంచి కొన్ని నక్షత్రాలు (Stars) విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు. గెలాక్సీ (Galaxy) రొటేషన్ ను నక్షత్రాల జనరల్ వెలాసిటీ డిస్పెర్షన్ ప్రతిబింబిస్తుంది. గెలాక్సీ రొటేషన్ నుంచి నక్షత్రం పక్కదారి పడితే, దానిని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు. గెలాక్సీ కన్నా భిన్నమైన వేగంతో కదులుతున్న నక్షత్రాలు ఇలా బయటకు వెళ్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గెలాక్సీ నుంచి బయటకు వెళ్లే ఇటువంటి నక్షత్రాలను రోగ్ స్టార్స్ అంటారు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి నక్షత్రాలు ఈ విధంగా బయటకు పోయినట్లు అంచనా.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)