Chikungunya Vaccine: చికెన్‌ గున్యాకు తొలి టీకా.. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్‌ వ్యాధి చికెన్‌ గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌ గున్యా వ్యాక్సిన్‌ కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.

Vaccination (Photo Credits: ANI)

Newdelhi, Nov 11: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్‌ వ్యాధి చికెన్‌ గున్యా (Chikungunya) నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌ గున్యా వ్యాక్సిన్‌ (Vaccine) కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ‘Ixchiq’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఫ్రెంచ్‌ బయోటెక్‌ కంపెనీ వాల్వేనా అభివృద్ధి చేసింది. చికెన్‌ గున్యా వైరస్‌ బారిన పడేందుకు ఎక్కువ ప్రమాదం ఉన్న 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ వ్యాక్సిన్‌ ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ ను సింగిల్‌ డోసుగా ఇంజెక్షన్‌ ద్వారా కండరంలోకి పంపిస్తారు. చికెన్‌ గున్యా సోకిన దోమకాటు వల్ల మనిషికి ఈ చికెన్‌ గున్యా వ్యాధి వస్తుంది. గత 15 ఏండ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది వరకు ఈ వైరస్‌ బారిన పడ్డారు.

Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement