Hyd, Dec 16: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024 ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీన స్థితిలో సర్పంచ్ లు ఉన్నారని అన్నారు.
నేడు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారని... ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానమని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
Harish Rao Speech in Assembly
అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయ్ అని ఆ దేశ పౌరులకు హెచ్చరించింది...ఇది మన రాష్ట్రానికి,దేశానికి అవమానం - అసెంబ్లీలో హరీష్ రావు @BRSHarish #AssemblySession #Telangana #TnewsTelugu pic.twitter.com/971P7P1Yfa
— TNews Telugu (@TNewsTelugu) December 16, 2024
హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేసిన కాంగ్రెస్ MLA.#HarishRao #TelanganaAssembly2024 #TelanganaAssembly #TelanganaAssemblyWinterSession #BRSParty #Congress #KCR #RevanthReddy #KTR #Telangana #BRKNews pic.twitter.com/pMJqGAqG75
— BRKNews (@BRKTelugu_1) December 16, 2024
అసెంబ్లీలో హరీష్ రావు బ్యాక్ టు బ్యాక్ కౌంటర్లు ! Harish Rao#TelanganaAssembly #HarishRao #BRS #Congress #NTVNews #NTVTelugu pic.twitter.com/qVaYjhLmEV
— NTV Telugu (@NtvTeluguLive) December 16, 2024
తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైనా ఇంకా వారికి జీతాలు చెల్లించలేదు. ఒకటో తేదీన జీతాలిస్తున్నమని గొప్పగా చెబుతరు.. కానీ జెడ్పీ చైర్మెన్లకు జెడ్పీటీసీలు, ఎంపీటీలకు ఇంప్పటికీ వారికి మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వారికి స్పష్టమైన తేదీ చెప్పాలి. పంచాయతీ ఎన్నికలలోపు వారికి జీతాలు చెల్లించాలి.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రాజీవ్‌గాంధీ తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం, గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తామన్నరు. క్రమంతప్పకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నరు. అవేమీ చేయకుండా కనీసం జీతాలు కూడా ఇస్తాలేరు. వారి జీతాలు, పెండింగ్ నిధులను ఎప్పటిలోగా క్లియర్ చేస్తరో స్పష్టంగా చెప్పాలని’ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, సర్పంచుల పెండింగ్ బిలులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.