Vinay Prakash: భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్, అధికారిక వెబ్‌సైట్‌లో నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను పొందుపరిచిన ట్విట్టర్‌

Twitter logo (Photo courtesy: Twitter)

భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్‌ ఎట్టకేలకు అంగీకరించింది. భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. సోషల్‌ మీడియాకు సంబంధించి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్‌ కంప్లైయిన్స్‌, గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్‌ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement