WhatsApp: వాట్సాప్ దారులకు హెచ్చరిక, 16 లక్షలపైగా వినియోగదారుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను ఏప్రిల్ నెలలో బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ వెల్లడించింది.

WhatsApp’s hidden feature(Photo-pixabay)

16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను ఏప్రిల్ నెలలో బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ వెల్లడించింది. తాము ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో తాము ఇండస్ట్రీ లీడర్‌గా ఉన్నామని వాట్సాప్ ప్రతినిధి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, అనలిస్టులు, రీసెర్చర్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, ఆన్‌లైన్ సేఫ్టి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడి బృందాలను నియమించామని తెలిపారు. ఇబ్బందికరమైన కంటెంట్ ఏదైనా కనిపిస్తే వినియోగదారులే ఫిర్యాదు చేయడమేకాకుండా.. సదరు కాంటాక్ట్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే తమకు ఫిర్యాదులు అందిన పలు వాట్సాప్ ఖాతాలను కూడా బ్యాన్ చేశామని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now