Bus Accident in Nepal: ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి, దాదాపు 300 మీటర్ల లోతులో పడిన బస్సు

లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తూర్పు నేపాల్‌లోని శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

Accident Representative image (Image: File Pic)

నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. బస్సు లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తూర్పు నేపాల్‌లోని శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దాదాపు 300 మీటర్ల లోతులో పడింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 14మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement