Saudi Arabia Road Accident: హజ్‌‌యాత్ర‌కు తిరిగిరానిలోకాలకు, సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం, 20 మంది మృతి, మరో 20 మందికి గాయాలు

సౌదీ అరేబియాలోని అసిర్‌ ప్రావిన్స్‌ (province of Asir) లోగల అకాబత్‌ షార్‌ రహదారిపై సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాత్రికుల బస్సు ఖమీస్‌ ముషైత్‌ నుంచి అభాకు వెళ్తోంది.

Road Accident (Representational Image)

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Bus accident) చోటు చేసుకుంది.హజ్‌‌యాత్ర (hajj yatra)కు వెళ్తున్న యాత్రికులతో బస్సు ప్రమాదానికి గురైంది. సౌదీ అరేబియాలోని అసిర్‌ ప్రావిన్స్‌ (province of Asir) లోగల అకాబత్‌ షార్‌ రహదారిపై సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాత్రికుల బస్సు ఖమీస్‌ ముషైత్‌ నుంచి అభాకు వెళ్తోంది.

ఆ సమయంలో బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ , సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాచక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif