Pakistan Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యానికి 28 మంది బలి, అదుపుతప్పి లోయలో పడిపోయిన బస్సు, బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఘటన
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్బాట్ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది.
పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకొంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్బాట్ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపుతప్పి ఆ లోయలో పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)