Taiwan Tsunami Warning: జపాన్ కు మరోసారి సునామీ హెచ్చరిక, తైవాన్‌లో భారీ భూకంపం, అలర్టయిన జపాన్, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదు, వణికిపోతున్న జపాన్ తీర ప్రాంతాలు
రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. జపాన్ వాతావరణ సంస్థ, పసిఫిక్ సునామీ (tsunami warning) హెచ్చరికల కేంద్రం.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, తర్వాతీ అప్‌డేట్స్‌లో భారీగా అలలు ఎగిసి పడే ముప్పేమీ లేదని ప్రకటించాయి.
Taiwan, SEP 18: తైవాన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. జపాన్ వాతావరణ సంస్థ, పసిఫిక్ సునామీ (tsunami warning) హెచ్చరికల కేంద్రం.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, తర్వాతీ అప్‌డేట్స్‌లో భారీగా అలలు ఎగిసి పడే ముప్పేమీ లేదని ప్రకటించాయి. అమెరికా జియాలజికల్ సర్వే (USGS) అంచనా ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. తెలుస్తున్నది. జపాన్ సునామీ హెచ్చరిక (tsunami warning) జారీ చేసినా.. యూఎస్‌జీఎస్ ప్రాథమికంగా భూకంప తీవ్రత 7.2 నుంచి 6.9కి తగ్గించి వేసింది. భూకంపం ప్రభావంతో జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు కుదుపులకు గురైన వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యాయి.