Middle East Tension: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

ఓ వైపు జ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.

Air India (photo-Wikimedia Commons)

Air India suspends all flights operations to Tel Aviv: ఓ వైపు జ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులను (Flights) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నోటీసులిచ్చేంతవరకు టెల్‌అవీవ్‌ (Tel Aviv) నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది.  బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అంతకుముందు ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్‌ అవీవ్‌ మధ్య విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now