Plane Crash in Brazil: బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)

బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.

Plane Crash in Brazil (Credits: X)

Newdelhi, Aug 10: బ్రెజిల్‌ (Brazil) లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో  గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం ఇండ్ల మధ్య అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో  ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement