US Crime: తల్లిని చంపిన కొడుకు, అంతటితో ఆగకుండా రోడ్ల మీద జనాలను కూడా చంపాలని చూసిన ఉన్మాది, అమెరికాలో దారుణ ఘటన

తను నడుపుతున్న వాహనాన్ని అక్కడున్న జనాల పైకి తోలాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

అమెరికాలో ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతుండగా ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని అక్కడున్న జనాల పైకి తోలాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు నేరుగా ఇంటికెళ్లాడు. అక్కడ తన సొంత తల్లిని హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.సదరు డ్రైవర్ వయసు 24 సంవత్సరాలని పోలీసులు తెలిపారు.ఈ ఘటన కొలంబియా కౌంటీలో వెలుగు చూసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)