Sydney Building Fire: సిడ్నీలో ఘోర అగ్ని ప్రమాదం, ఏడంతస్తుల భవనంలో భారీగా ఎగసిన మంటలు, అదుపుచేస్తున్న 100 మంది సిబ్బంది

మంటల ధాటికి భవన శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Representative image (Photo Credit: Pixabay)

సిడ్నీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ఏడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి భవన శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

100 అగ్నిమాపక సిబ్బంది, 20 యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.ప్రమాదస్థలానికి కొద్ది దూరంలోనే సిడ్నీలోని అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ ఉంది. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు తెలిపారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)