
Hyderabad, Feb 24: హైదరాబాద్ (Hyderabad) కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఘటన స్థలానికి వెంటనే చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలు ఆర్పారు. మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని, ఆ మంట త్వరగా ఆవరణలో నిల్వ చేసిన ముడి పదార్థాలు, పూర్తయిన వస్తువులకు వ్యాపించిందని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు జరగలేదు. ఆర్థిక నష్టం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు.
Here's Video:
కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
నిన్న రాత్రి ప్రశాంత్ నగర్లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో తప్పిన పెనుప్రమాదం pic.twitter.com/9VfLCvoNlg
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025
నెల కిందట కూడా..
హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలో (KPHB) నెల రోజుల కిందట కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కేపీహెచ్‌బీలోని అర్జున్ థియేటర్ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో హోటల్‌లో ఉన్న ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. హోటల్ వెలుపల ఆపి ఉంచిన రెండు మోటారు సైకిళ్లు కూడా దగ్ధమయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.